28 April 2011

విజయమ్మ సీఎం అయినా జగన్ తట్టుకోలేడు: డీఎల్

కడప ఉపఎన్నికల సమయం సమీపిస్తున్నకొద్దీ మాటల తూటాలు పేలుతున్నాయి. కడప లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విరుచుక పడ్డారు
ముఖ్యమంత్రి పదవి రాలేదన్న అక్కసుతోనే వైఎస్ జగన్ పార్టీ నుంచి బయటకు వెళ్లారని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ జగన్ తల్లి విజయమ్మకు ముఖ్యమంత్రి పదవి వరిస్తే, దానిని కూడా సహించలేడని విమర్శించారు.
జగన్ దేశంలోనే పెద్ద అవినీతిపరుడనీ, ఆయన అవినీతి ఆయనను చిత్తుచిత్తుగా ఓడిస్తుందని జోస్యం చెప్పారు. తన వద్ద ఉన్న అవినీతి సొమ్మును ప్రజలపై వెదజల్లి గెలవాలనుకుంటున్నాడనీ, అయితే జగన్‌కు ఓటర్లు తగిన బుద్ధి చెపుతారన్నారు.
ఎలాగైనా ముఖ్యమంత్రి పదవిని అధిష్టించి కోట్లకు కోట్లు దండుకోవాలని జగన్ పన్నాగం పన్నుతున్నాడనీ, తిమ్మిని బమ్మి చేస్తూ తన సాక్షి పత్రికలో అసత్య కథనాలను ప్రచురిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు జగన్ యత్నిస్తున్నాడని ఆరోపించారు.
కడప నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ఎక్కడికీ పోలేదనీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓట్లు కాంగ్రెస్ కే పడతాయన్నారు. కడపలో తెలుగుదేశం పార్టీ కాస్త బలహీనంగా ఉంది కనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండస్థానంలో ఉంటుందని చెప్పారు.

Congress, YSR Congress

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us