|
ఒక వర్గం మీడియా ప్రసారం చేస్తున్న, ప్రచురిస్తున్న మీడియా కథనాలను ఆధారంగా చేసుకునే తమకు షోకాజ్ నోటీసులు జారీ చేశారని పరకాల ఎమ్మెల్యే, జగన్ వర్గం మహిళా నేత కొండా సురేఖ ఆరోపించారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తాను లేదా తాము ఎన్నడూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదన్నారు.
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటిస్‌కు సమాధానం ఇచ్చినట్టు ఆమె చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై డిసెంబర్ తొమ్మిదో తేదీ తేదీన కేంద్రం ఎందుకు ప్రకటన చేసిందని ప్రశ్నించారు. ఆ తర్వాత ఈ ప్రకటనకు ఎందుకు కట్టుబడి ఉండకుండా ద్రోహం చేశారన్నారు.
ప్రజల్లో తమ పరువు ప్రతిష్టలను ప్రతిష్టను దెబ్బతీసేందుకే కుట్ర జరుగుతోందని ఆమె వాపోయారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా సోనియా సభలో ఉండగానే పార్లమెంట్ సభ్యులు రెండు రోజులపాటు సభను స్తంభింప చేస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోరా అంటూ ప్రశ్నించారు.
అలాగే, తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసిన డి.శ్రీనివాస్ ఓడిపోతారని బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన వారి పట్ల ఎందుకు మెతక వైఖరిని అవలంభించారన్నారు. ఇకపోతే.. ఉప ఎన్నికల్లో కడప ఎంపీ స్థానం నుంచి వైఎస్.జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందుతారని ఆమె జోస్యం చెప్పారు.

0 comments:
Post a Comment