|
పదవులపై తనకు మోజు లేదని, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిలాగా తనకు సీఎం పదవిపైగాని, మంత్రి పదవిపైగా మోజు లేదని మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. తాను రాజకీయాల్లోకి కాకతాళియంగానే వచ్చానని, రెండు సార్లు మంత్రి పదవికూడా తనకు అలానే వచ్చిందని, పదవులకోసం ఎవరినీ బ్రతిమాలలేదని డీఎల్ అన్నారు. సీఎం పదవిపై డీఎల్ కన్ను వేశారని ఓ పత్రికలో వచ్చిన కథనంపై డీఎల్ వివరణ ఇచ్చారు. సీఎం పదవిపై తనకు మోజు ఉంటే కడప ఉప ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా ఎందుకు పోటీ చేస్తానని అన్నారు. ఉప ఎన్నికల్లో జగన్‌ను గెలిపిస్తే అవినీతిని గెలిపించినట్లేలని డీఎల్ అన్నారు

0 comments:
Post a Comment