|
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత స్వార్థం కోసం రాజీనామా చేశావు తప్ప ప్రజల సమస్యలు తీర్చలేదని రాజీనామా చేశావో చెప్పాలని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రంనాయుడు అన్నారు. మంగళవారం ఖాజీపేటలో విలేకరులతో మాట్లాడుతూ కుంభకోణాలు, అవినీతిని అరికట్టలేదని రాజీనామా చేశావా అని చెప్పాలని, నీ సొంత స్వార్థం కోసం రాజీనామా చేసి ప్రజలపై భారం మోపావని అన్నారు. అధికార అండదండలతో, అవినీతి సొమ్ము చూపి నాయకులను మార్చుకొన్న ప్రజు మాత్రం తెలుగుదేశానికి బ్రహ్మారథం పడుతున్నారని, గతంలో శ్రీకాంత్‌రెడ్డికి మంచి మెజార్టీ వచ్చిందని, కాంగ్రెస్ చీలడంతో తెలుగుదేశానికి మంచి మెజార్టీ వస్తుందన్నారు.
పేద, బడుగు, బలహీన వర్గాల వారికి టిడిపి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని, కాంగ్రెస్‌పార్టీ ఏమీ చేయలేదన్నారు. జగన్ వారసత్వం అన్నప్పుడు ఆయన ప్రవేశపెట్టినప్పుడు వారసత్వం అడగాలి తప్ప రాజకీయం కోసం వారసత్వం తప్ప పథకాలకు కాదనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలకు మందులు లేక ఇబ్బంది పడుతుంటే సమస్యలు చూడకుండా కడప చుట్టూ మంత్రులు తిరుగుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి ప్రధాన కార్యదర్శి అరవిల్‌గీత్, టిడిపి మహిళా కార్యదర్శులు లక్ష్మి, శాంతమ్మ, సాంసృ్కతిక విభాగ అధ్యక్షుడు సాయిబాబా, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

0 comments:
Post a Comment