|
సత్యసాయిబాబా ట్రస్ట్ వ్యవహారాలన్నీ పారదర్శకంగానే ఉన్నాయని, కావాలనే కొందరు ట్రస్ట్‌పై బురదజల్లుతున్నారని ట్రస్ట్ సభ్యుడు శ్రీనివాసన్ వివరించారు. 20 ఏళ్ల తరువాత తొలిసారిగా ట్రస్ట్ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. ట్రస్ట్ లావాదేవీలకు సంబంధించిన అకౌంట్స్ ఐటీ నిబంధనలకు లోబడే ఉన్నాయని ట్రస్ట్ సభ్యులు వివరించారు. ట్రస్ట్ సేవా కార్యక్రమాలన్నీ యథావిధిగా కొనసాగుతాయని శ్రీనివాసన్ వెల్లడించారు. ట్రస్ట్ తరనపున ఫ్రీజర్‌కు ఆర్డర్ ఇవ్వలేదని, ఓ భక్తుడు పంపించాడని వారు వివరించారు. ట్రస్ట్ సభ్యుల మధ్య బేధాభిప్రాయాలు లేవని, సత్యజిత్ బాబా వ్యక్తిగత సహాయకుడు మాత్రమేనని, అతనికి మిగతా విషయాలతో సంబంధం లేదని శ్రీనివాసన్ చెప్పారు. విలేకర్లు అడిగిన ప్రతి ప్రశ్నకు ట్రస్ట్ సభ్యులు ఒక్కొక్కరుగా ఓపికతో సమాధానం చెప్పారు. ట్రస్ట్ బాధ్యతలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, దీనికోసం ప్రభుత్వ సహాయం కోరలేదని సభ్యులు వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ సహకారం కోరమని, ట్రస్టు అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రభుత్వం కూడా ఇష్టపడట్లేదని వారు వివరించారు. సత్యసాయి ఇండోర్ స్టేడియంలో ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం ప్రారంభం కాగా ముందుగా ట్రస్ట్ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించి బాబాకు శ్రద్ధాంజలి ఘటించారు. - మీడియా సమావేశానికి ట్రస్టీలు ఎస్. చక్రవర్తి, పీఎమ్. భగవతి, ఎస్వీగిరి, ఇందూలాల్ షా, శ్రీనివాసన్, నాగానంద్, రత్నాకర్ హాజరయ్యారు.

0 comments:
Post a Comment