|
బావ, తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ.. తమ రెండు కుటుంబాల మధ్య వారసత్వ పోరు మీడియా సృష్టేనని తోసిపుచ్చారు.
మీడియా సృష్టించిన ఈ వారసత్వ పోరును మీడియానే పరిష్కరించాలని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. నందమూరి కుటుంబమంతా కలిసే ఉందని బాలయ్య ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 62వ ఏటలోకి అడుగుపెట్టిన వియ్యంకుడు చంద్రబాబు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని బాలకృష్ణ ఆకాంక్షించారు.

0 comments:
Post a Comment