|
ఉప ఎన్నికల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులపై ప్రచారం చేస్తామని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల వెనక జగన్‌తో కలిసి బీజేపీ కుట్ర చేస్తోందని డీఎస్ ఆరోపించారు.
సందర్భం వచ్చినప్పడు బీజేపీకి, వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మధ్య గల సంబంధాలను బయటపెడతామని డీఎస్ వ్యాఖ్యానించారు. వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి కర్ణాటక మంత్రి, బీజేపి నాయకుడు గాలి జనార్దన్ రెడ్డితో కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై జగన్ విమర్శలు చేయడం వెనక బీజేపి హస్తముందని డీఎస్ ధ్వజమెత్తారు. వై.ఎస్ జగన్ కేంద్రంలో ఏ పార్టీకి మద్దతిస్తారని డీఎస్ ఈ సందర్భంగా ప్రశ్నించారు.
జగన్ వర్గం శాసనసభ్యులు తాము కాంగ్రెసు శాసనసభ్యులమని చెప్పుకునే అర్హతను కోల్పోయారని డీఎస్ అన్నారు. రాష్ట్రంలో వైయస్ జగన్ గెలిస్తే బీజేపీ మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు.
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీతో కలిసి బీజేపీ రాష్ట్రంలో కుట్ర చేస్తోందని, జగన్‌ను పావుగా పెట్టి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి బిజెపి ప్రయత్నాలు సాగిస్తోందని డీఎస్ విమర్శించారు. తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి బీజేపీ వైయస్ జగన్‌ను వాడుకుంటోందని ఆయన అన్నారు

0 comments:
Post a Comment