|
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం అనుమతి లేకుండా ఏ పథకాన్ని అమలు చేయలేదని మంత్రి బొత్స సత్యనారాయణ ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. వైఎస్సార్ చేసిన పనులకు మంత్రులుగా తమ బాధ్యత కూడా ఉందని బొత్స వ్యాఖ్యానించారు.
వై.ఎస్. రాజశేఖర రెడ్డి తన హయాంలో మంచి చేసినా, చెడు చేసినా అందులో మంత్రులుగా తమ బాధ్యత కూడా ఉందని వెల్లడించారు. వైయస్ హయాంలో భూకేటాయింపులపై హౌస్ కమిటీ వేయటంలో తప్పు లేదన్నారు.
పారదర్శకత కోసమే హౌస్ కమిటీ వేశామని బొత్స చెప్పారు. ఉచిత విద్యుత్ పథకంపై కేంద్రం రాసిన లేఖకు వివరణ ఇస్తామని చెప్పారు. ఉచిత విద్యుత్‌ను తప్పకుండా కొనసాగిస్తామని చెప్పారు.

0 comments:
Post a Comment