పార్టీని ధిక్కరించిన ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డిలపై వేటు వేయాలని ఒత్తిడి పెరుగుతోందని పార్టీలో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని పిఆర్పీ రాష్ట్ర అధ్యక్షుడు చిరంజీవి తెలిపారు. కడప అమీన్ దర్గా నిర్వాహకుల ఆహ్వానం మేరకు బుధవారం ఉరుసు ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఓ లాడ్జిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చిరు మాట్లాడుతూ శోభానాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డిల అనర్హత పిటిషన్‌ను డిప్యూటి స్పీకర్‌కు పంపే విషయమై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తాను పులివెందుల అసెంబ్లీ, కడప లోక్‌సభ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తే పంతం ఉంటుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి,, పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌లు పలు సమావేశాల్లో మత్రుల సమక్షంలో కోరడంతో ఈనెల 28.29,30 తేదీలలో ప్రచారంలో పాల్గొంటున్నట్లు తెలిపారు.
0 comments:
Post a Comment