రాష్ట్ర ప్రభు త్వానికి, కాంగ్రెస్ నాయకత్వానికి దమ్ముంటే జగన్‌కు మద్దతు ఇస్తున్న అందరిపైనా అనర్హత వేటు వేయాలని మాజీ మంత్రి, జగన్ వర్గం ఎమ్మెల్యే కొండా సురేఖ సవాల్ విసిరారు. కడప లో జగన్ పక్షాన, ఆయన తల్లిగారు విజయమ్మ పక్షాన ప్రచారం చేస్తున్న ఏ కొందరిపైనో వేటు వేయటాన్ని ఆమె తప్పు పట్టారు. బుధవారం శాసనసభ మీడియా పాయింట్‌లో మాట్లా డుతూ కాంగ్రెస్‌పై సురేఖ నిప్పులు చెరిగారు. తమపై వేటు వేసేందుకు కాంగ్రెస్‌కు అర్హత లేదని, చిరంజీవిని కాంగ్రెస్‌లో చేర్చుకున్నప్పుడే ఆ పార్టీ తమపై తామే వేటు వేసుకోవాలన్నారు.
see more in www.Suryaa.com
0 comments:
Post a Comment