|
దీనిపై ఆయన న్యూఢిల్లీలో మాట్లాడుతూ తాను రాసిన లేఖకు సోనియా వద్ద నుంచి సమాధానం వచ్చిందన్నారు. ఆమె రాసిన లేఖను చదవడంతో చాలా సంతోషం కలిగిందన్నారు. తమపై దుష్ప్రచారం చేసే వారికి మద్దతు ఇవ్వబోనని ఆమె స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
దేశంలో పెరిగిపోతున్న అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు వీలుగా లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టి, పార్లమెంట్‌లో ఆమోదించాలని కోరుతూ హజారే నిరాహారదీక్ష చేసిన విషయం తెల్సిందే. దీనికి కేంద్రం తలొగ్గి లోక్‌పాల్ ముసాయిదా రూపకల్పనకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, ఈ కమిటీలో పౌర సమాజం సభ్యులుగా ఉన్న వారిపై కాంగ్రెస్ పార్టీకే చెందిన నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెల్సిందే.

0 comments:
Post a Comment