21 April 2011

లోక్‌పాల్ బిల్లు ఏర్పాటును బలపరుస్తాం: సోనియా

 

లోక్‌పాల్ వ్యవస్థ ఏర్పాటును పూర్తిగా బలపరుస్తున్నామని కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ స్పష్టం చేశారు. లోక్‌పాల్ బిల్లును నిర్వీర్యం చేసేందుకు జరిగే ఎలాంటి ప్రయత్నాలను తాను బలపరచడం లేదని సోనియా గాంధీ ప్రముఖ సంఘ సేవకుడు అన్నా హజారేకు రాసిన ప్రత్యుత్తరంలో స్పష్టం చేశారు.

సోనియా గాంధీ బుధవారం అన్నా హజారేకు రాసిన లేఖలో లోక్‌పాల్ బిల్లు రూపకల్పనపై తన అభిప్రాయాన్ని వివరించారు. అవినీతి, లంచగొండితనాన్ని రూపుమాపేందుకు అత్యవసరంగా చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని సోనియా ఆ లేఖలో పేర్కొన్నారు.

అవినీతిపై పోరాడే విషయంపై తన చిత్తశుద్ధిపై ఎలాంటి అపనమ్మకాలు ఉండవలసిన అవసరం లేదని సోనియా స్పష్టం చేశారు. అవినీతిపై పోరాటానికి తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని సోనియా ప్రకటించారు. నేషనల్ అడ్వయిజరీ కౌన్సిల్ (ఎన్‌ఎసి) అజెండాలో లోక్‌పాల్ బిల్లు ఓ ప్రధాన అంశమని అన్నాకు గుర్తుచేస్తున్నాని ఆమె తెలిపారు.

Congress

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us