|
యువనేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కోరారు. ఇదే అంశంపై వారు గురువారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప సభాపతి డిప్యూటీ స్పీకర్‌లను కలిశారు.
ఈ సందర్భంగా జగన్ వర్గానికి చెందిన వరంగల్ జిల్లా ఎమ్మెల్యే కొండా సురేఖ, కడప జిల్లా ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అమరనాథ్ రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని వారు నాదెండ్లకు ఫిర్యాదు చేశారు. వారిని అనర్హులుగా ప్రకటించడానికి కావాల్సిన పత్రికా కట్టింగులను, వీడియోలను నాదెండ్లకు భట్టి విక్రమార్క అందజేశారు. కాగా గురువారమే ఇదే నలుగురికి పీసీసీ షోకాజ్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే
0 comments:
Post a Comment