|
యువనేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ, కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆది నారాయణ రెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలకు ఈ నోటీసులు జారీ చేశారు.
ఈ నోటీసుల్లో మీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని వారిని ప్రశ్నించింది. కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభకు ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అతి తొందరగా జగన్ వర్గం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని పార్టీ భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.
వీటిని నిజం చేసేలా పీసీసీ చర్యలు చేపట్టింది. జగన్‌తో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వెళుతున్నప్పటికీ కేవలం నలుగురికి మాత్రమే నోటీసులు ఇచ్చి మిగిలిన వారిని దారిలోకి తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతో పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా పార్టీ పీసీసీ నలుగురి ఎమ్మెల్యేల పేర్లను మాత్రమే అధిష్టానానికి పంపింది. దీనికి అధిష్టానం సమ్మతం తెలుపడంతో పీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

0 comments:
Post a Comment