|
పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే కడప లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీచేస్తానని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి అన్నారు. కడపలో శనివారం విలేఖరులతో మాట్లాడుతూ పార్టీ అభ్యర్థి ఎవరు అనేది అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు. పార్టీ తరపున ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా సంపూర్ణ మద్దతు అందజేస్తానన్నారు. ఎవరికి టికెట్ ఇచ్చినా జిల్లా నాయకులంతా కలసి కట్టుగా పని చేస్తామన్నారు. నాలుగు రోజుల క్రితం పులివెందుల, కడప ఉప ఎన్నికలపై చంద్రబాబునాయుడు జిల్లా నేతలతో హైదరాబాద్‌లో చర్చించారన్నారు. మరోసారి సమావేశమై అభ్యర్థులు ఎవరైనది నిర్ణయిస్తామన్నారు. తాను ఉప ఎన్నికల్లో పోటీ చేయాలన్నా రాజ్యసభ సభ్యుడుగా ఒకటిన్నర సంవత్సర కాలం ఉందన్నారు.

0 comments:
Post a Comment