ప్రపంచకప్ గెలుపొందడం నా చిరకాల వాంఛ అని ఇప్పుడు ఆ కల నెరవేర్చుకోవడం తాను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నట్లు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ప్రపంచకప్ గెలిచిన తర్వాత వ్యాఖ్యానించారు. జట్టులోని సభ్యులంతా కూడా ప్రపంచకప్‌కు ముందు సచిన్ కోసమైనా ఈ కప్ గెలుస్తామని చెప్పారు. వారు అన్నట్టుగానే వారు సచిన్ కోసమైనా మ్యాచ్ గెలిచారు. ఈ కప్పును సచిన్‌కు, తమకు అండగా నిలబడిన భారత ప్రజలందరికీ అంకితమిస్తున్నట్లుగా చెప్పారు.
కాగా యువరాజ్ మాట్లాడుతూ భారత జట్టు బలహీనంగా ఉందన్న వారి నోళ్లు ప్రపంచ కప్ గెలవడం ద్వారా మూయించామని అన్నారు. ఈ ప్రపంచ కప్ దేశ ప్రజలందరికీ అంకితమని హర్భజన్ సింగ్, కెప్టెన్ ధోనీ అన్నారు. కాగా కప్ గెలిచిన అనంతరం జట్టు సభ్యులు సచిన్ టెండుల్కర్‌ను భుజాలపై ఎత్తుకొని స్టేడియం కలియదిరిగారు. కోచ్ గ్యారీ కిర్‌స్టన్‌ను కూడా భుజాలపైకి ఎత్తుకొని స్డేడియంలో కలయదిరిగారు.
Tagged as : General Issues
STARS
0 comments:
Post a Comment