|
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని తిట్టిన వాళ్లకు జనమే బుద్ధిచెబుతారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. విశ్వసనీయతకు, వంచనకు మధ్య పోరాటంలో భాగంగానే వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందన్నారు. చిత్తూరు జిల్లాలో మొదటిసారిగా తిరుపతిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం శనివారం ఘనంగా ప్రారంభమయింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్‌రావు,కొండా మురళి, దేశాయ్ తిప్పారెడ్డి, మాజీమంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్, అంబటి రాంబాబు, టిటిడి మాజీ చైర్మన్ భూమన్ కరుణాకరరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, గట్టు రామచంద్రరావు, వైవి సుబ్బారెడ్డి, సినీనటి రోజా, తదితరులు మాట్లాడుతూ వైఎస్‌ఆర్ జీవించి ఉన్నంత కాలం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేశారని, దీంతో ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీలోని ఢిల్లీ పెద్దలకు మింగుడుపడలేదన్నారు. దీంతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో కలిసి వైఎస్‌ఆర్ ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. మ్యాచ్‌ఫిక్సింగ్‌లను జనం గమనిస్తున్నారన్నారు. వీరికి తగు బుద్ధి చెబుతారన్నారు. సోనియాకు, జగన్‌కు మధ్య జరుగుతున్న యుద్ధంలో కడప జిల్లా ఉఎ ఎన్నికలు తొలి అంకం మాత్రమేనన్నారు. నాడు దివంగత ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీని గడగడలాడిస్తే, నేడు యువనేత వైఎస్ జగన్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ఢీ కొంటున్నారన్నారు. అటు ఎన్టీఆర్, ఇటు వైఎస్‌ఆర్‌లా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో జనంలోకి వెళ్లే సత్తా జగన్‌కు మాత్రమే ఉందన్నారు

0 comments:
Post a Comment