|
కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ ఉపఎన్నికలు యుపిఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మధ్య జరుగుతున్న పోటీ అని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి కడప జిల్లా ప్రొద్దుటూరులోని జూటూరు కళాక్షేత్రంలో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డికి జరిగిన అభినందన సభలో జగన్ మాట్లాడుతూ త్వరలో రాష్ట్ర రాజకీయాల్లో జరిగే మార్పులకు కడప ఉపఎన్నికలు నాంది పలుకుతాయన్నారు. పుట్టీపుట్టకముందే వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలకు నాంది పలికిందన్నారు. జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్, టిడిపి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నాయన్నారు. నీచ రాజకీయాలు ప్రస్తుతం రాష్ట్రంలో చోటుచేసుకున్నాయన్నారు.
ప్రజలు అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా మనస్సాక్షిగా ఓటు వేసి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఉప ఎన్నికల్లో తమను ఓడించేందుకు కాంగ్రెస్, టిడిపి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడయన్నారు. కడపలో కాంగ్రెస్ తరఫున, పులివెందులలో తెలుగుదేశం తరఫున డమీ అభ్యర్థులను నిలిపి రెండు పార్టీలు మ్యాచి ఫిక్స్‌ంగ్‌కు పాల్పడుతున్నాయన్నారు. ఉప ఎన్నికలు కడప బిడ్డలకు ప్రతిష్టాత్మకమన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్‌ను ఓడించి ఆ పార్టీలకు కడప ప్రజలు బుద్ధిచెప్పాలన్నారు

0 comments:
Post a Comment