05 April 2011

ఇప్పటికీ ఆడాలనే ఉంది : సచిన్‌

వన్డేలకు గుడ్‌బై చెప్పే ఆలోచన ఇప్పట్లో తనకు లేదని అభిమానులకు అనందకరమైన విషయాన్ని బ్యాటింగ్‌ సంచలనం సచిన్‌ టెండూల్కర్‌ స్పష్టం చేశారు. భారతదేశం కోసం ఇంకా ఆడాలన్న ఉత్సాహం తనలో ఉందని సచిన్‌ అన్నారు. కికెట్‌ ఆడాలన్న ఉత్సాహం తనలో తగ్గలేదని, ఇంకా ఆడాలన్న ఉత్సాహం రైట్టింపు అయ్యిందని గతంలోకంటే ప్రస్తుతం ఆటను ఎక్కువగా ఆస్వాదిస్తున్నామని లిటిల్‌ మాస్టర్‌ వెల్లడించారు. ఆటకు గుడ్‌బై చెప్పడానికి కారణాలేవి ఇంకా దొరకలేదన్నాడు. ఇప్పటివరకు వన్డేల నుంచి తప్పుకోవాలన్న ఆలోచన తన మదిలో మెదలలేదని, ఒకవేళ అలాంటిది ఏమైనా కలిగితే ప్రతిఒక్కరికి తెలుపుతామని సచిన్‌ అన్నారు. గతంలో కంటే ప్రస్తుతం జట్టులో మ్యాచ్‌ విన్నర్లు ఎక్కువగా ఉన్నారని సచిన్‌ అన్నారు. అంతేకాకుండా జట్టు సమతూకంగా ఉందని మాస్టర్‌ బ్లాస్టర్‌ తెలిపాడు. ఇప్పటివరకు సచిన్‌ 177 టెస్టుల్లో 14592 పరుగులు, 453 వన్డేల్లో 18111 పరుగులు సాధించాడు.

General Issues, STARS

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us