05 April 2011

వైఎస్ఆర్ ఆశయ సాధనకే కాంగ్రెస్‌లో ఉంటున్నా: వివేకా

దివంగత మహానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధన కోసమే తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్టు రాష్ట్ర మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి చెప్పుకొచ్చారు. ఇందుకోసమే తన జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పారు. అందువల్ల వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మే ఎనిమిదో తేదీన జరుగనున్న ఉప ఎన్నికలపై ఆయన స్థానిక నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌తోనే సుపరిపాలన సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ఆర్‌తో సహా పార్టీ కార్యకర్తలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఆదరించిందన్నారు. అదే విధంగా తాను కూడా ఆదరిస్తానని, మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

అంతేకాకుండా, తన సోదరుడు డాక్టర్ వైఎస్ఆర్ ఆయన జీవిత కాలమంతా కాంగ్రెస్ పార్టీకే అంకితం చేశారని, ఆయన ఆశయ సాధన కోసం తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నానన్నారు. ఎవరో కాంగ్రెస్ పార్టీని గురించి తెలియకుండా మాట్లాడుతున్నారని, అలా బయటకు వెళ్లి ప్రాంతీయ పార్టీలను పెట్టినంత మాత్రానా ఏమీ ఒరిగేది లేదని పరోక్షంగా జగన్‌ను ఉద్దేశించి అన్నారు.

తాను మూడు దశాబ్దాలుగా తన సోదరుడు రాజశేఖర్ రెడ్డితో మమేకంగా ఉంటూ కార్యకర్తలను ఆందుకుంటూ రావడం జరిగిందన్నారు. ఇకపై కూడా అదేవిధంగా తాను శక్తివంచన లేకుండా పని చేస్తానని స్థానిక నేతలకు ఆయన హామీ ఇచ్చారు.

Congress

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us