|

ఓటమితో తిరుగుముఖం పట్టిన పాక్ జట్టుకు మాజీ ఆటగాళ్ళు, రాజకీయనాయకులు, అభిమానుల నుండి అనూహ్యరీతిలో.. ఘన స్వాగతం లభించింది. అధికార, ప్రతిపక్షాలకు చెందిన కొంతమంది పాకిస్తాన్ పొలిటీషియన్లు పాక్ జట్టును వెనకేసుకొచ్చారు. సెమీస్‌లో ఓడిపోయిన్పటికీ.. ఆ స్థితికి చేరడానికి పాక్ అద్భుతంగా రాణించిందని అభిప్రాయపడ్డారు. ‘‘ఓ పటిష్ట జట్టుపై పాక్ పోరాడి ఓడిపోయింది. అయితే.. అభిమానుల సెంటిమెంట్‌ను కూడా అర్ధం చేసుకోవాలి’’ అని పాక్ మాజీ ఆటగాడు మొయిన్ ఖాన్ అభిప్రాయపడ్డాడు.
అంతేకాకుండా పంజాబ్ (పాకిస్తాన్) ముఖ్యమంత్రి షహ్బాజ్ షరీఫ్ ప్రతి ఆటగాడికి అయిదు లక్షల రూపాయల ప్రైజ్ మనీ ప్రకటించడం కొసమెరుపు. ‘‘ఈ టోర్నీలో పాక్ అద్భుతంగా ఆడి సెమీఫైనల్ వరకు రావడం గ్రేట్. సెమీఫైనల్‌లో కూడా చివరికంటా పోరాడింది. ఈ విషయంలో జట్టును తప్పకుండా అభినందించాలి’’ అని జియో న్యూస్‌తో మాట్లాడిన షహ్బాజ్ అభిప్రాయపడ్డాడు. ఓటమి భారంతో వెనుదిరిగిన పాక్ జట్టు అభిమానుల కోపానికి గురవుతారేమోనని భావించినా.. వారి నుండి ఘన స్వాగతం లభించడం విశేషం. దాదాపు 25 వేల మంది పాక్ అభిమానులు పాకిస్తాన్ క్రెట్ బోర్డ్ లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఏర్పాటు చేసిన జాయింట్ స్క్రీన్‌పై మ్యాచ్‌ను ఆస్వాదించారు.

0 comments:
Post a Comment