|
రాష్ట్ర ఎంపీల మధ్య తెలంగాణ అంశం చిచ్చుపెట్టిందని, దీనివల్ల ఐక్యంగా ఉండే ఎంపీలు ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి దిగజారి పోయారని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మన ఎంపీలు అసమర్థ ఎంపీలుగా ఉన్నారన్నారు. అందుకే రాష్ట్రానికి రావాల్సిన అన్ని రకాల ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు తరలివెళుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యంగా మన ఎంపీల మధ్య ముఖ్యంగా, అధికార పార్టీ కాంగ్రెస్ ఎంపీలు ప్రాంతాల వారీగా చీలిపోయి గోడవలు పడుతూ రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా విస్మరించారన్నారు. చివరకు తెలంగాణ అంశాన్ని అడ్డుపెట్టుకుని గొడవలకు దిగడమే కాకుండా ఒక ప్రాంతం ఎంపీలతో మరో ప్రాంత ఎంపీలు మాట్లాడుకోమని వారు ప్రకటించడం ఎంతవరకు సమంజసమన్నారు.

0 comments:
Post a Comment