|
ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈనెల 16 లేదా 18వ తేదీల్లో కడప లోక్‌సభ ఉప ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి జరుగుతున్నవిగా ఆయన పేర్కొన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల సొమ్మును అక్రమంగా దోచుకున్న వైఎస్.జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

0 comments:
Post a Comment