|
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను స్థాపించిన పార్టీలో చేరనివారినందరినీ ‘ద్రోహులుగా’ ముద్ర వేయడాన్ని కాంగ్రెస్ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ శుక్రవారం తీవ్రంగా ఆక్షేపించారు. జగన్ ప్రవర్తిస్తున్న తీరు ఆయన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకాంక్షలకు విరుద్ధంగా ఉందని ఉండవల్లి ఆరోపించారు. రాజశేఖరరెడ్డికి చట్టపరమైన, నైతిక, రాజకీయ వారసుడినని చెప్పుకుంటున్న జగన్ తన తండ్రి ‘సిద్ధాం తానికి పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తున్నారు’ అని కూడా ఆయన ఆరోపించారు. ‘రాజశేఖరరెడ్డి వెంట ఉన్న వారంతా తనతో ఉండాలన్న నియమాన్ని ఆయన (జగన్) పెట్టాలని అనుకుంటున్నారు. అలా కాకపోతే వారు ద్రోహులని, ఊసరవెల్లులని ఆయన అంటున్నారు.
అది మాకు సమ్మతనీయం కాదు’ అని రాజమండ్రి ఎంపి ఉండవల్లి పేర్కొన్నారు. రాజశేఖరరెడ్డి వెంట ఉన్నవారంతా కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్ నుంచి నిష్ర్కమించినవారే ఊసరవెల్లులు. ఆయన ద్రోహి. ఎందుకంటే కాంగ్ర ెస్ ఎప్పుడూ బలంగా ఉండాలని వైఎస్ సదా కోరుకుంటుండేవారు’ అని ఉండవల్లి పేర్కొ న్నారు. ‘సోనియా గాంధికి మద్దతు ఇవ్వడానికి వ్యతిరేకిని కాను’ అని మీడియాలో జగన్ చేసిన ప్రకటనను కూడా ఉండవల్లి విమర్శించారు. తన తండ్రి రాజశేఖరరెడ్డి మాటతీరు కు భిన్నంగా ఆయన మాట్లాడుతున్నారని ఉండవల్లి వ్యాఖ్యానించారు.
కడప లోక్‌సభ స భ్యత్వానికి తన రాజీనామా కారణంగా నిర్వహిస్తున్న ఉప ఎన్నికలలో తిరిగి పోటీ చేస్తున్న జగన్ ‘అటువంటి మద్దతు వల్ల నాకు ప్రయోజనం కలిగేటట్లయితే అలా చేయడానికి అ భ్యంతరం లేదు’ అని ప్రకటించినట్లు తెలుస్తున్నది. 2014 ఎన్నికలలో కాంగ్రెస్‌కు రా ష్ట్రంలో 51 శాతం వోట్లు రావాలని రాజశేఖరరెడ్డి కార్యకర్తలతో తన చివరి సమావేశంలో కోరిన విషయాన్ని ఉండవల్లి గుర్తు చేస్తూ, ‘దానిని మరణ వాంగ్మూలంగా పరిగణించాలి’ అని అన్నారు. ‘అది ఆయన ఆకాంక్ష. ఆయన ఆ కాంక్షలకు విరుద్ధంగా జగన్ వ్యవహ రిస్తున్నారు. కాంగ్రెస్‌ను వదలి వెళ్లాలని వైఎస్‌ఆర్ ఎన్నడూ కోరుకోలేదు. ఆయన మేడమ్‌ని ఒక దేవతగా ఎప్పుడూ పరిగణించేవారు’ అని ఉండవల్లి పేర్కొన్నారు.
courtesy www.suryaa.comఅది మాకు సమ్మతనీయం కాదు’ అని రాజమండ్రి ఎంపి ఉండవల్లి పేర్కొన్నారు. రాజశేఖరరెడ్డి వెంట ఉన్నవారంతా కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్ నుంచి నిష్ర్కమించినవారే ఊసరవెల్లులు. ఆయన ద్రోహి. ఎందుకంటే కాంగ్ర ెస్ ఎప్పుడూ బలంగా ఉండాలని వైఎస్ సదా కోరుకుంటుండేవారు’ అని ఉండవల్లి పేర్కొ న్నారు. ‘సోనియా గాంధికి మద్దతు ఇవ్వడానికి వ్యతిరేకిని కాను’ అని మీడియాలో జగన్ చేసిన ప్రకటనను కూడా ఉండవల్లి విమర్శించారు. తన తండ్రి రాజశేఖరరెడ్డి మాటతీరు కు భిన్నంగా ఆయన మాట్లాడుతున్నారని ఉండవల్లి వ్యాఖ్యానించారు.
కడప లోక్‌సభ స భ్యత్వానికి తన రాజీనామా కారణంగా నిర్వహిస్తున్న ఉప ఎన్నికలలో తిరిగి పోటీ చేస్తున్న జగన్ ‘అటువంటి మద్దతు వల్ల నాకు ప్రయోజనం కలిగేటట్లయితే అలా చేయడానికి అ భ్యంతరం లేదు’ అని ప్రకటించినట్లు తెలుస్తున్నది. 2014 ఎన్నికలలో కాంగ్రెస్‌కు రా ష్ట్రంలో 51 శాతం వోట్లు రావాలని రాజశేఖరరెడ్డి కార్యకర్తలతో తన చివరి సమావేశంలో కోరిన విషయాన్ని ఉండవల్లి గుర్తు చేస్తూ, ‘దానిని మరణ వాంగ్మూలంగా పరిగణించాలి’ అని అన్నారు. ‘అది ఆయన ఆకాంక్ష. ఆయన ఆ కాంక్షలకు విరుద్ధంగా జగన్ వ్యవహ రిస్తున్నారు. కాంగ్రెస్‌ను వదలి వెళ్లాలని వైఎస్‌ఆర్ ఎన్నడూ కోరుకోలేదు. ఆయన మేడమ్‌ని ఒక దేవతగా ఎప్పుడూ పరిగణించేవారు’ అని ఉండవల్లి పేర్కొన్నారు.

0 comments:
Post a Comment