రాజకీయ అక్కసుతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని సినీ నటి, రాజకీయ నాయకురాలు రోజా అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మాటల్లోగానీ చేతల్లో నైతికత లేదని రోజా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అవసరానికి అనుగుణంగా ఫ్లేటు ఫిరాయిస్తుందని ఆరోపించారు. జగన్ వర్గ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి వై.ఎస్ ఫోటో లేకుండా సోనియా ఫోటోతో గెలవాలని సవాల్ విసిరారు. ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వంలో సంక్షోభం తప్పదని రోజా హెచ్చరించారు. ఉప ఎన్నికలలో జగన్, విజయమ్మ బంపర్ ఆధిక్యంతో గెలుస్తారని రోజా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కడప ఉప ఎన్నికలలో ప్రచారం చేయడం వల్ల కాంగ్రెసు పార్టీ కంటే జగన్మోహన్ రెడ్డికే ఎక్కువ లాభిస్తుందన్నారు.
0 comments:
Post a Comment