21 April 2011

హైకమాండ్ ఆదేశాల మేరకే ఉప ఎన్నికల ప్రచారం: చిరు

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే కడప, పులివెందుల ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చినట్టు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తెలిపారు. ఈ ఎన్నికల కోసం ఆయన బుధవారం రాత్రి కడపకు చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా కడప పెద్ద దర్గాకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు కడప ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తానన్నారు. మూడు రోజుల పాటు ప్రచారం నిర్వహిస్తానని చెప్పారు. మంత్రి డీఎల్‌ రవీంద్రా రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వచ్చిన కథనంపై ఆయన మండిపడ్డారు.
ఆ పత్రిక అవినీతి నుంచి పుట్టుకొచ్చిందని ఆరోపించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. తనపై కాంగ్రెస్ పార్టీ ఎంతో నమ్మకంతో ఉందని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని చిరంజీవి ప్రకటించారు.

Congress

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us