|
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ తెలిపారు. గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో సివిల్ సర్వీస్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెడతామన్నారు. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేకుండా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెడతామన్నారు.
ఇకపోతే అవినీతి దేశానికి పెను సవాల్‌గా మారిందని, అవినీతిపై కఠినంగా వ్యవహరిస్తామని నొక్కి వక్కాణించారు. అభివృద్ధికి అవినీతి అవరోధకంగా మారిందన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాలలో లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెడతామని ఆయన అన్నారు. అవినీతి నిరోధకానికి వ్యవస్థలు, చట్టాలు సరిగా చేయట్లేదనే భావన ప్రజల్లో పెరిగిపోతోదంన్నారు.
అవినీతిని ప్రజలు సహించబోరన్నారు. అవినీతి ఫిర్యాదులపై సత్వరం స్పందించేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నదే ప్రజల అభిమతంగా ఉందన్నారు. అందువల్ల అవినీతి అడ్డుకట్టకు అవసరమైన అన్ని రకాల చర్యలను తాము చేపడుతామని ఆయన తెలిపారు.

0 comments:
Post a Comment