|
భారతీయ జనతా పార్టీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు కుదుర్చుకునే ప్రసక్తే లేదని మాజీ పార్లమెంట్ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీతో జగన్ కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై యువనేత మండిపడ్డారు. ఉప ఎన్నికల్లో తన తల్లి విజయమ్మను, తనను ఓడించడానికి కాంగ్రెస్ నీతిమాలిన చర్యలకు పాల్పడుతుందని జగన్ ధ్వజమెత్తారు. ఉప ఎన్నికల్లో తమను ఎదుర్కొనలేక అసత్య ఆరోపణలు గుప్పిస్తుందని గురువారం కడప జిల్లా రోడ్ షోలో ధ్వజమెత్తారు. కడప జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన ఏడు వేల మంది కార్యకర్తలపై బైండోవర్ కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీ వేధిస్తోందని జగన్ ఆరోపించారు. ఉపఎన్నికల్లో తమను ఓడించడానికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాయని జగన్ విమర్శించారు.

0 comments:
Post a Comment