|
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జిఓ 177పై ఆందోళన అవసరంలేదని ిపీసీసీ అధికార ప్రతినిధి ఎన్.తులసిరెడ్డి పేర్కొన్నారు. గత ఏపీ సివిల్ సర్వీసు యాక్ట్‌లోని అంశా లను పునశ్చరణ చేస్తూ ఈ జిఓను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఇది రాష్ట్రం మొత్తానికి వర్తిస్తుందన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఏ ఒక్క ప్రాం తాన్ని దృష్టిలోఉంచుకొని ఈ జిఓను తీసుకురాలేదన్నారు. ఉద్యోగులు ప్రజా ధనంతో జీతాలు తీసుకొంటున్నందు వారికి సేవలు సక్రమంగా అందించే ఉద్దేశంతో కూడినదే ఈ జిఓ అని తెలిపారు. ఈ జిఓపై ఎవరికైనా అను మానాలు ఉంటే సిఎంను కలసి నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు.
courtesy www.Suryaa.com
courtesy www.Suryaa.com

0 comments:
Post a Comment