
అన్నా హజారెకు సన్నిహితంగా మెలగుతున్న వ్యక్తులు బిజెపికి ‘ఏదో విధంగా సన్నిహితులు’ అని కాంగ్రెస్ సీనియర్ నాయ కుడు దిగ్విజయ్ సింగ్ శుక్రవారం న్యూఢిల్లీలో ఒక టివి కార్యక్రమంలో చెప్పారు. లోక్‌పాల్ బిల్లు ముసాయిదా రూపకల్పన కోసం పది మంది సభ్యులతో ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీలో న్యాయవాదులైన తండ్రీ కొడుకులు శాంతి భూషణ్, ప్రశాంత్ భూషణ్‌లను ఎలా చేర్చారని ఆయన ప్రశ్నించారు. ‘నిరాడంబరుడు, అమాయకుడు’ అయిన హజారె తనకు సన్నిహితంగా మెలగుతు న్న వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని కూడా దిగ్విజయ్ సింగ్ హెచ్చరించారు.
వారు ‘తమ ప్రయోజనాలు’ చూసుకుంటారని ఆయన అన్నారు. లోక్‌పాల్ బిల్లు కోసం ఏర్పాటు చేసిన సంయుక్త ముసాయిదా కమిటీలో అరుణా రాయ్‌ని గాని, హర్ష్ మందర్‌ను గాని హజారె ఎందుకు చేర్చుకో లేదని దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. లోక్‌పాల్ బిల్లును పార్లమెంట్ ఆగస్టు 15 లోగా ఆమోదించని పక్షంలో నిరసన ప్రదర్శనకు పూనుకొంటానని హజారె బెదిరించడాన్ని, గుజరాత్ సీఎం నరేంద్ర మోడి ప్రశంసించడాన్ని దిగ్విజయ్ తప్పు పట్టారు. గాంధేయ వాది హజారె మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలని ఆయన సలహా ఇచ్చారు.
0 comments:
Post a Comment