|
|
పశ్చిమ బెంగాల్‌లో తనకు భారీ స్థాయిలో మెజారిటీ లభించగలదని ప్రతి ఒపీనియన్ పోల్ సూచిస్తుండ డంతో తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అధ్యక్షురాలు, రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో 34 ఏళ్ల లెఫ్ట్ ఫ్రంట్ పాలనకు భరత వాక్యం పలకగలమనే ధీమాతో ఉన్నారు.ఒక వైపు ఎన్నికల ప్రచారం సాగిస్తూనే మమతా బెనర్జీ ‘సిఎన్‌ఎన్ - ఐబిఎన్’ చానెల్‌కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంట ర్వ్యూలో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో తానే తదుపరి ముఖ్య మంత్రిని కాగలనని, తన నాయకత్వం కారణంగానే కాంగ్రెస్ గెలుస్తున్నదని స్పష్టం చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి బాధ్య తలు స్వీకరిస్తారా లేక ‘రిమోట్ కంట్రోల్’ పాలన సాగిస్తారా అనే ప్రశ్నకు మమత సమాధానం ఇస్తూ, ఆవిధంగా ఆలోచిం చవద్దని అన్నారు. ‘ముందు ప్రజలను వోటు వేయనివ్వండి. ప్రజలు నిర్ణయించినప్పుడు వారి అభిప్రాయం ప్రకారం నడుచుకుంటాను. వారు నన్ను అభిమానిస్తున్నారు కనుక నాకు వోటు వేస్తున్నారు. అది వారి నిర్ణయం. వారికి నమ్మక ద్రోహం చేయజాలను. నేను వారిని వంచించలేను. ఈ దఫా వారు దీనిని కోరుకుంటున్నారు. కొన్ని సార్లు ప్రజల నిర్ణయాన్ని మన్నించవలసి ఉంటుంది’ అని ఆమె చెప్పారు.
మరి మీరే ముఖ్యమంత్రి అవుతారు కదా అన్నప్పుడు, ప్రజ లే నిర్ణయిస్తారని తన అభిప్రాయమని, అది వోట్లపై ఆధారపడి ఉంటుందని, మెజారిటీ వచ్చినప్పుడు సిఎంను అవుతానని మమత సమాధానం ఇచ్చారు.
మరి కాంగ్రెస్ సంగతేమిటని, ఆ పార్టీ పునరుత్థానం సాధ్యమేనని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు మమత సమాధానం ఇస్తూ, తాము పూర్తి మద్దతు ఇస్తున్నందున వారు ఎన్నికలలో గెలుస్తారని అన్నారు.
0 comments:
Post a Comment