పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న సీపీఎం ఇప్పుడు ఏ చిన్న ఆధారం దొరికినా కష్టాల నుంచి గట్టెక్కాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ బహిష్కృత సీనియర్ నాయకుడు, లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీని పార్టీ తరఫున ప్రచారం నిర్వహించాలని సీపీఎం ప్రాధేయపడుతోంది. ‘పశ్చిబెంగాల్ అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేశాం. వారిలో పార్టీ బహిష్కృత నేత సోమ్‌నాథ్ చటర్జీ కూడా ఒకరు’ అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు సీతారామ్ ఏచూరి శుక్రవారం సీపీఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. కాగా, సోమ్‌నాథ్‌ను పార్టీలోకి తిరిగి ఆహ్వానిస్తారా అన్న పత్రికా ప్రతినిధుల ప్రశ్నకు ఏచూరి సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేశారు.
see more in www.Suryaa.com
0 comments:
Post a Comment