|
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితోపాటు పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్, చిరంజీవి అందరూ కలసి పనిచేసినా గెలుపు తమదేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమలో తమ నేత వైఎస్ జగన్మోహన రెడ్డి బలం తెలుసుకోవాలంటే ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ కడపలో పర్యటించాలని ఆయన అన్నారు. జగన్ పై ఎంపి ఉండవల్ల అరుణ్ కుమార్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు సోనియా మెప్పు కోసమే ఆయన అలా మాట్లాడుతున్నారన్నారు. జగన్ పై విమర్శలు మానుకోకపోతే సోనియా నిజస్వరూపాన్ని బహిర్గతం చేస్తామని అంబటి హెచ్చరించారు.

0 comments:
Post a Comment