
కాంగ్రెస్ అధినేత్రి సోని యా గాంధీపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు చరిత్రను వక్రీక రించేటట్లు ఉన్నాయని రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. అవగాహనలేమితో సోనియాపై జగన్ తన అనుచిత వ్యాఖ్యలు మానుకుంటే మంచిదన్నారు. రాజమండ్రిలో ఆదివారం నాడు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, శాసనమండలి సభ్యులు కందుల దుర్గేష్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సోనియా గాంధీ కుటుంబం-వైఎస్ మధ్య ఉన్న అనుబంధం గురించి జగన్‌కు ఏం తెలుసని ఆయన వ్యాఖ్యా నించారు. కడప, పులివెం దుల ఉప ఎన్నికల సందర్భంగా జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయన అవసరాల కోసం చరిత్రను వక్రీకరించే టట్లు ఉన్నాయని ఆయన అన్నారు. మానవత్వం చంపుకుంటే సోనియాకు సన్నిహితుడినై ఉండేవాడినని జగన్ వ్యాఖ్యానించడాన్ని ఉండవల్లి తప్పుబట్టారు.
Tagged as : Congress
YSR Congress
0 comments:
Post a Comment