|
దేశంలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు సూత్రధారి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కాగా, పాత్రధారి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆయన నల్గొండలో మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వ హయాంలలో జరుగుతున్న అన్ని రకాల అవినీతి కుంభకోణాలు సోనియాకు బాగా తెలుసన్నారు.
ప్రధాని డ్రైవర్ సీటులో ఉన్నా సోనియా చేతిలోనే స్టీరింగ్ ఉందని చెప్పారు. సుస్థిరమైన ప్రభుత్వాలు లేకపోవడం వల్లే దేశంలో అవినీతి పెరిగిపోతున్నదన్నారు. జాతీయ పార్టీల ప్రభావం తగ్గిపోవటానికి కారణాలు అన్వేషించాల్సిన అవసరం ఉందన్నారు.
అన్నా హజారే దీక్షకు అనూహ్యరీతిలో దేశ ప్రజల నుంచి మద్దతురావడం చూస్తుంటే అవినీతి నిర్మూలన కోసం వారు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతున్నదన్నారు. అవినీతి అంతంతోపాటు ఎన్నికల సంస్కరణలు కూడా తీసుకురావాలన్నారు. వారసత్వ రాజకీయాలకు సైతం స్వస్తి పలకాలన్నారు.

0 comments:
Post a Comment