|
పరిటాల హత్య కేసులో వైఎస్.జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వివిధ కేసుల్లో నిందితునిగా ఉన్న మంగలి కృష్ణకు జగన్ మూడు లక్షల రూపాయలు ఇచ్చారని డీఎల్ ఆరోపించారు. వైఎస్ఆర్ జగన్ పార్టీలో ఉన్న వారంతా అక్రమాలు, క్రిమినల్స్ చేసే నేరగాళ్లు ఉన్నారని ఆరోపించారు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, మంగలి కృష్ణలపై పులివెందులలో క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు.
సోమవారం కాంగ్రెస్ నేత కందుల రాజమోహన్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డిలు తోడు దొంగలనన్నారు. త్వరలో జరగనున్న కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్నారు.
కడప పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా తాను యాభైవేల మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని అన్నారు. కాంగ్రెస్ విజయాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదన్నారు. ఈ రెండు స్థానాల్లో తాము గెలిచి తీరుతామన్నారు.
ఇకపోతే.. చంద్రబాబు, జగన్‌లపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పెద్ద దొంగ అయితే జగన్మోహన్ రెడ్డి చిన్న దొంగగా అభివర్ణించారు. ఇద్దరూ అవినీతిపరులే అన్నారు. కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి పెద్ద భూబకాసురుడుతో సమానమన్నారు. ఈ నెల 16వ తేదిన మధ్యాహ్నం 12 గంటలకు తాను కడప పార్లమెంటు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలిపారు.

0 comments:
Post a Comment