|
వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద మే 13వ తేదీ తరువాత బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీ విధివిధానలు ప్రకటిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు చెప్పారు. ఉప ఎన్నికల తరువాత జరిగే భారీ బహిరంగ సభలో తెలంగాణపై పార్టీ వైఖరిని కూడా స్పష్టం చేస్తామన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ఉప ఎన్నికలలలో జగన్, విజయమ్మ గెలుపు ఖాయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

0 comments:
Post a Comment