|
మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిపై మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డీఎల్ పుట్టుకతోనే ఫ్యాక్షనిస్టు అని, ఆయన రాజకీయ జీవితమంతా నేరమయమని ఆయన ఆరోపించారు. 1985లో ఓటమిని జీర్ణించుకోలేని డీఎల్ గోపాల్‌రెడ్డి అనే వ్యక్తిని హత్య చేయించారని రఘురామిరెడ్డి తెలిపారు.
డీఎల్‌కు ఏమాత్రం ప్రజాస్వామ్యంపై గౌరవం ఉన్నా మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. దమ్ముంటే మంత్రి పదవికి రాజీనామా చేసి డీఎల్ నామినేషన్ దాఖలు చేయాలని రఘురామిరెడ్డి సవాల్ విసిరారు. ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పుతో వైఎస్ కుటుంబానికి క్షమాపణ చెప్పి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

0 comments:
Post a Comment