వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి జగన్‌మోహన్‌రెడ్డి ధన మదం తలకెక్కిందని కడప పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి మం త్రి డిఎల్ రవీంద్రారెడ్డి విమర్శించారు. గురువారం ఆయన జమ్మలమడుగులో కాంగ్రెస్‌పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి ప్రసంగించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌పార్టీకి వారసుడని అన్నారు.పులివెందుల, జమ్మలమడుగుల్లో ప్రజాస్వామ్యం లేదన్నారు. వైఎస్‌ఆర్ తనకు మిత్రుడని, ఆయన ఫోటో లేకుండా పోటీకి సిద్ధమైనప్పటికి హై కమాండ్ చెప్పింది కాబట్టి ఫోటో పెట్టుకుంటున్నారన్నారు.
source www.Suryaa.com
0 comments:
Post a Comment