|
యజ్ఞాలు, యాగాల వల్ల తెలంగాణా రాదని ప్రజల అభీష్టం మేరకే సాధ్యపడుతున్న విషయాన్ని టిఆర్‌ఎస్ నేత కె.చంద్రశేఖర్ తెలుసుకోవాలని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణ నీటి సరఫరాల శాఖా మంత్రి కె.జానారెడ్డి అన్నారు. గురువారం గుంటూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఆయన ఐబిలో విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో త్రాగు నీటి పధకాలు శాశ్వత ప్రాతిపదికన చేపడతామని ఆయన తెలిపారు. పంచాయతీరాజ్ ఎన్నికలు సకాలంలో నిర్వహించనున్నట్లు, ఇందుకు సంబంధించిన ప్రక్రియ రెండు నెలలలో పూర్తి కానున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనా పధకంలో కొన్ని పొరపాట్లు దొర్లటం వల్ల రాష్ట్రానికి రావల్సిన కేంద్ర నిధులు రాలేకపోయాయన్నారు. నీటి ఎద్దడి నివారణ కోసం 60 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు.కడప ఎన్నికలు గురించి కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ భయపడదని, ప్రజలు తమ పార్టీకే ఓట్లు వేస్తారనే విశ్వసనీయత తమకుందన్నారు.
source www.Suryaa.com
0 comments:
Post a Comment