|
కేసీఆర్ వల్ల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చే అవకాశం లేదని, ఆయన కుటుంబాన్ని ప్రజలు బహిష్కరిం చాలని సామాజిక తెలంగాణ ఓబీసీ జేఏసీ కన్వీనర్ కస్తూరి జయప్రసాద్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సికింద్రాబాద్‌లోని వైఎమ్‌సీ చౌరస్తాలో రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. టిఆర్‌ఎస్ పేరిట కుటుంబ పాలన నడుపుతున్న కేసీఆర్ పదేళ్ల నుంచి అగ్రవర్ణాల చేతుల్లోనే ఉద్యమం కొనసాగేలా చూస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రత్యేక రాష్ట్రం రావడాన్ని పరోక్షంగా అడ్డుకుంటున్నారన్నారు.
బీసీలపై అగ్రవర్ణాలతో దాడులు చేయిస్తూ వారి ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నా రని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే పై దాడే దానికి ఉదాహరణ అన్నారు.
courtesy www.Suryaa.com
బీసీలపై అగ్రవర్ణాలతో దాడులు చేయిస్తూ వారి ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నా రని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే పై దాడే దానికి ఉదాహరణ అన్నారు.
courtesy www.Suryaa.com

0 comments:
Post a Comment