
నన్ను ఒక్కడిని ఎదుర్కొనేందుకు పది మంది మంత్రులను దించి అనైతిక చర్యలకు పాల్పడుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పులివెందుల అసెంబ్లీ నియోజ కవర్గం పరిధిలోని వేముల మండలంలో ఆయన రోడ్ షోను గురువారం నిర్వహించి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. నిన్న, మొన్నటి దాకా వైఎస్ రాజశేఖరరెడ్డిని నోటికొచ్చినట్లు మాట్లాడిన డిఎల్ రవీంద్రారెడ్డికి ఆయన ఫోటో లేకపోతే ఎన్నికల్లో తిరగలేమన్న భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో సమూల మార్పులు రాబోతున్నాయని జగన్ అన్నారు. జరుగుతున్న ఉప ఎన్నికలు సెమీ ఫైనల్ అని, రాబోయే ఎన్నిక లు ఫైనల్ అని అన్నారు. ఎన్నికల సమరంలో తడాఖా చూపిస్తానని చెప్పారు.
0 comments:
Post a Comment