|

కడప ఉప ఎన్నికల ప్రచారం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నదని అన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఊహించని రీతిలో ఈ ఎన్నికల్లో పనిచేస్తున్నారని, సాధారణ ఎన్నికల మాదిరిగా భావించి చాలా చాకచక్యంగా, ఉత్తేజంతో పార్టీ శ్రేణులు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని ఆయన ప్రశంసించారు. బద్వేలు ఎమ్మెల్యే కమలమ్మ మళ్ళీ కాంగ్రెస్‌లో వచ్చారా? అని అడిగిన ప్రశ్నకు డిఎస్ స్పందిస్తూ వాస్తవంగా ఆమె కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే, పార్టీలో మళ్ళీ వచ్చారా? అనడం సరికాదు, ఆమె మా పార్టీతోనే ఉన్నారని సమాధానం ఇచ్చారు. కడపలో ఇప్పటికీ కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగన్ వెంట పాల్గొంటున్న విషయాన్ని డిఎస్ దృష్టికి తీసుకురాగా అలాంటి వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయి, ఈ విషయాన్ని తాను గతంలోనే చెప్పడం జరిగింది, సిఎంతో ఈ విషయమై మాట్లాడుతున్నా, తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఆయన చెప్పారు.
తనకు, సిఎంతో విభేదాలున్నట్లు ఏదో ఒక ప్రతిక రాసినంత మాత్రానా నిజమనుకోవడం సరికాదని మరో ప్రశ్నకు సమాధానంగా డిఎస్ స్పష్టం చేశారు. కడప ఉప ఎన్నికల్లో పార్టీకి చెందిన్న అన్ని ఆంశాలపై స్థానిక నేతలతో చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకున్నామని, కడప నేతలు చెప్పిందే విన్నామని, వాళ్ళ నిర్ణయమే తమ నిర్ణయంగా ప్రకటించామని, కడప లోక్‌సభకు, పులివెందుల అసెంబ్లీ స్థానాలకు మంత్రులు డిఎల్, వివేకాలను స్థానిక నేతల అభిప్రాయాల మేరకే ఎంపిక చేసినట్లు డిఎస్ వెల్లడించారు.
see more in www.Suryaa.com

0 comments:
Post a Comment