|
కడప, పులివెందుల ఉప ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 212 సీట్లు వస్తాయన్న సర్వే నివేదిక కాంగ్రెస్ హైకమాండ్ వద్ద ఉందని వెల్లడించారు.
జగన్ పార్టీని వీడితే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు తీరని నష్టం జరుగుతుందని ఆరు నెలల క్రితమే స్పష్టం చేశానని, దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఒక సర్వే నిర్వహించిందని తెలిపారు. ఈ సర్వేలో జగన్‌కు 212 అసెంబ్లీ సీట్లు వస్తాయని తేలిందన్నారు. ఉప ఎన్నికల్లో జగన్, వైఎస్ విజయమ్మ ఘన విజయం తథ్యమన్నారు. ఈ ఎన్నికల తరువాత రాష్ట్రంలో అనిశ్చితి ఉత్పన్నమవుతుందన్నారు.

0 comments:
Post a Comment