|
తనకు ప్రాణహాని ఉందని తెలిసి కూడా, కడప ఉపఎన్నికల ప్రచారానికి వెళుతున్న తనకు భద్రతను తొలగించారని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు రెహ్మాన్ అన్నారు. తనకు ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తన ప్రాణాలకు ముప్పు ఉందనే విషయాన్ని పోలీసులకు తెలిపానన్నారు. అయినప్పటికీ కడప ఉపఎన్నికల ప్రచారానికి వెళుతున్న తనకు ప్రభుత్వం భద్రతను తొలగించిందన్నారు. తాను కడప ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నానన్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే 3వేల మంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారన్నారు. పోలీసుల సాయంతో వైఎస్‌ఆర్ పార్టీ కార్యకర్తలను ముఖ్యమంత్రి ఎక్కడిక్కడ అణచివేస్తున్నారన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన వైఎస్ మహనీయుడన్నారు. ముస్లింల సమస్యలను పరిష్కరించింది వైఎస్ తప్ప సోనియా కాదన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం ఖాయమన్నారు. కడపలో ముస్లింల ఓట్లు జగన్‌కే వేస్తారన్నారు. మంత్రులు షబ్బీర్ అలీ, అహ్మదుల్లా, తదితరులంతా వచ్చి ప్రచారం చేసినా ముస్లిం ఓటర్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులకే ఓటు వేస్తారన్నారు.
source www.Andhra Bhoomi.net
source www.Andhra Bhoomi.net

0 comments:
Post a Comment