|
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమితో ప్రజలకు జగన్ వివరించాలని 20 సూత్రాలు అమలు కమిటీ ఛైర్మన్ తులసిరెడ్డి సవాలు విసిరారు. కడప కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో గురువారం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే యువజన శ్రామిక పార్టీనా లేక సుబ్బరాయుడు పార్టీనా అని ప్రశ్నించారు. సోనియా గాంధీకి తనకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని జగన్ చెప్పడం దారుణమని, ఆయన ఒక దద్దమ్మ అంటూ ధ్వజమెత్తారు. కేవలం సిఎం పదవి కోసమే జగన్ పాకులాడుతున్నారన్నారు. సోనియాను విమర్శించే అర్హత జగన్‌కు గానీ, ఆయన వర్గీయులకు గానీ లేదన్నారు. దివంగత వైఎస్. రాజశేఖర్‌రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారని ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కాంగ్రెస్ పార్టీవేనన్నారు. జగన్ వైఎస్‌కు కుమారుడిగా వారసుడేనన్నారు.
see more in www.Andhra Bhoomi.net
see more in www.Andhra Bhoomi.net

0 comments:
Post a Comment