15 April 2011

హోల్‌సేల్‌గా హామీలు, రిటైల్‌గా ఉపసంహరణలు

రాష్ట్ర ప్రభుత్వం హోల్‌సేల్‌గా హామీలు ఇచ్చేసి, రిటైల్‌గా పథకాలను ఉపసంహరిస్తోందని సిపిఐ రాష్టక్రార్యదర్శి డాక్టర్ కె. నారాయణ గురువారం నాడు విమర్శించారు. పార్టీ రాష్టక్రార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఉచిత విద్య పేరుతో ఫీజుల రీయంబర్స్‌మెంట్‌ను ప్రవేశపెట్టి ఓట్లను కొల్లగొట్టుకుని అధికారంలోకి వచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక, ఫీజులు చెల్లించలేమని అనడం భావ్యం కాదని అన్నారు. ఒక వేళ ఆ పథకాన్ని కుదించాలనుకుంటే 2014 ఎన్నికల వరకూ ఆగాలని, ఎన్నికల సమయంలో ఈ విషయాన్ని ప్రజలకు వివరించి, వారి అంగీకారంతో కుదించాలని అన్నారు.
see more in www.Andhra Bhoomi.net

C.P.I, Congress

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us