|
కడప లోక్‌సభ, పులివెందుల శాసనసభ ఉప ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లేంతటి పెద్దనాయకుడిని కానని కాంగ్రెస్ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్ధితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్ప నేతని చెప్పడమే కాకుండా, వైఎస్ జగన్ జిందాబాద్ అనేవారిని మాత్రమే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తోందని, మిగిలిన వారిపై బురదజల్లుతోందని ఆయన ధ్వజమెత్తారు. తాను జీవితాంతం వైఎస్‌ఆర్ ఆశయాల సాధనకు కట్టుబడి ఉంటానని, తన గురించి వైఎస్‌ఆర్ అసెంబ్లీలో, మీడియా ఇంటర్వ్యూల్లో పేర్కొన్న వాస్తవ విషయాలను ప్రస్తుతం తనను విమర్శిస్తున్న జగన్ అనుచరులు గమనించాలని కోరారు.
see more in www.Andhra Bhoomi.net
see more in www.Andhra Bhoomi.net

0 comments:
Post a Comment