|
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్ అవినీతిని నిరూపిస్తే తన తల నరుక్కుంటానని పోసాని సవాలు చేశారు. ఇప్పుడు రాజకీయాల్లో వైయస్ జగన్ మాత్రమే మంచివాడని మీడియా ప్రతినిధులతో తెలిపారు. ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు, వైయస్సార్ కుటుంబ సభ్యులు మాత్రమే నిజాయితీపరులని ఆయన అన్నారు.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో నిజాయితీ లేదని, నందమూరి హరికృష్ణ వంటి ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో మాత్రమే నిజాయితీ ఉందని, బతికి ఉంటే తాను ఎన్టీ రామారావుతో ఉండేవాడినని పోసాని వెల్లడించారు.
ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి వ్యక్తిగతంగా మంచివాడని, అయితే జెండా, పార్టీ కార్యాలయం మూసేశారని, తాను తిట్టిన కాంగ్రెసులోనే చేరుతున్నారని, అందువల్ల చిరంజీవికి నిజాయితీ కొరవడిందని ఆయన అన్నారు. చిరంజీవిని ప్రజలు నమ్మడం లేదని ఆయన అన్నారు. నిద్ర మేల్కొనే లోపే చిరంజీవి పార్టీ కనుమరుగైందని పోసాని వ్యాఖ్యానించారు.

0 comments:
Post a Comment