|
ఆధారాలు లేకుండా అబద్ధపు ప్రచారం చేయడం కొంతమంది నాయకుల పని అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ సంపాదించిన ఆస్తి అక్రమంగా వచ్చిందని రుజువు చేసే సాక్ష్యాలేమైనా ఉంటే బహిర్గతం చేసి తర్వాత మాట్లాడాలన్నారు. అంతేతప్ప బురద జల్లుడు కార్యక్రమం చేయకూడదని హితవు పలికారు.
హఠాత్తుగా తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ కు మద్దతు పలుకడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. 2014 నాటికి తెలంగాణా నాది... సీమాంధ్ర నీది అనే ఫార్ములాతో వీరిద్దరూ ముందుకు వస్తారన్న ఊహాగానాలకు మరింత ఊతం ఇచ్చినట్లయ్యింది.

0 comments:
Post a Comment